
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సన్నిహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా (Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఉంటే తనకు తన సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు.
ఫారిన్ పాలసీపై జాతీయమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా మాట్లాడారు. భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్‌తో సహా ఇతర దేశాలతో తన సంబంధాలను మెరుపరుచుకోవాలని తెలిపారు.
భారత్ విదేశాంగ విధానంపై నా అభిప్రాయం ప్రకారం.. భారత్ తొలుత పొరుగు దేశాలతో సంబంధాలపై దృష్టి పెట్టాలి. నేను పాకిస్థాన్‌కు వెళ్లాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. అక్కడ నేను సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందాను. పాక్‌తో పాటు బంగ్లాదేశ్,నేపాల్‌కు వెళ్లాను. అక్కడ కూడా ఇంట్లో ఉన్న అనుభూతే కలిగింది’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నానన్న ఫిలింగ్ లేదు. నాకు నా ఇంట్లో ఉన్నట్లు అనిపించిందని అన్నారు.
పిట్రోడా చేసిన పైవ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. పహల్గాం ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోవడం, ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టడం వంటి సున్నిత పరిణామాల తర్వాత పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి.
“I've been to Pak, and I must tell you, I felt at home,” says Sam Pitroda.
Frankly hate such stories. But why does Pitroda always offer such moronic full-tosses to BJP, even if his point is nuanced? Damages his party every time he opens his mouth. pic.twitter.com/ZDbEdu8sIu— Shiv Aroor (@ShivAroor) September 19, 2025