సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.. బీజేపీ నేత ఫైర్‌ | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ సీఎంపై బీజేపీ నేత ఫైర్‌

Published Fri, Dec 29 2023 1:31 PM

Republic Day tableau row: Manjinder Singh Slams On Bhagwant Mann - Sakshi

బీజేపీ చెత్త రాజకీయలు చేస్తోందన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విమర్శలపై ఢిల్లీ బీజేపీ నేత మన్‌జిందర్‌ సింగ్‌ సిర్సా మండిపడ్డారు. ‘రిపబ్లిక్‌ డే’ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే ఘాటాల వ్యవహారంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మన్‌జిందర్ అన్నారు.

ఇటీవల ఇదే విషయంపై పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్‌ డే ఘాటాల విషయంలో పంజాబ్‌పై తీవ్రమైన వివక్ష చూపుతోందని మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ బీజేపీ నేత మన్‌జిందర్ స్పందించి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. పంజాబ్‌ రాష్ట్ర ఘాటాన్ని తిరస్కరించడానికి అసలైన నిజం మరోటి ఉందని తెలిపారు.

పంజాబ్‌ రూపొందించే ఘాటంపై మై భాగో జీ, అమరవీరుల ఫొటోలకు బదులుగా.. పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫొటోలు ఉన్నాయని అన్నారు. భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే పంజాబ్‌ ఘాటం తిరస్కరణకు గురైందని తెలిపారు. భగవంత్ మాన్.. పంజాబ్‌ సార్వభౌమత్వాన్ని కేజ్రీవాల్‌ కాళ్ల వద్ద వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. 

ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల సంబంధించిన ఘాటాలను ‘రిపబ్లిక్‌ డే’ ఉత్సవాలకు పంజాబ్‌ ఘాటం ఎంపిక చేయకుండా బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆప్‌ నేత ప్రియాంఖ్‌ కక్కర్‌ శుక్రవారం విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, అస్సాం, ఉత్తర్‌ఖండ్‌లకు చెందిన ఘాటాను వరుసగా ఎంపిక చేస్తోందని.. ఢిల్లీ, పంజాబ్‌లను మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు తప్పించిందని మండిపడ్డారు.

చదవండి: క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..

Advertisement
 
Advertisement