Rajnath Singh Hits Back At Obama On Muslims In India Remark - Sakshi
Sakshi News home page

మైనారిటీల భద్రత విషయమై ఒబామాకు కౌంటర్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్  

Jun 26 2023 4:32 PM | Updated on Jun 26 2023 5:11 PM

Rajnath Singh Hits Back At Obama On Muslims In India Remark - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్బంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశంలో మైనారిటీల భద్రత గురించి ప్రశ్నించాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొదట వ్యాఖానించగా ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ కూడా ఘాటుగా స్పందించారు. 

బరాక్ ఒబామా వ్యాఖ్యలపై మొదట స్పందించిన నిర్మలా సీతారామన్..  మీ హయాంలో మొత్తం ఆరు ముస్లిం దేశాలపైన దాడులు జరిగాయని, దాదాపుగా 26 వేలకు పైగా బాంబులు వేశారు. ఆయన మాటలను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు.

తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించే ఏకైక దేశం భారతదేశమని, ఈ విషయం ఒబామా మరచిపోకూడదని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో ఆయన ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు  చేశారన్నది కూడా ఆలోచించాలని అన్నారు.  

ఇది కూడా చదవండి: ప్రధానికి మణిపూర్లో పరిస్థితిని వివరించిన అమిత్ షా

  

Advertisement
 
Advertisement
Advertisement