తాడేపల్లిగూడెం ఉమ్మడి సభ.. చంద్రబాబు తీవ్ర అసహనం

No Public For TDP Jana Sena Tadepalligudem Jenda Meeting - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.  వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజాస్పందనను చూస్తూ.. ప్రతిపక్ష కూటమి తమ సభలకు జనాలను బలవంతంగా అయినా తరలించే యత్నం బెడిసి కొట్టింది. 99 మంది అభ్యర్థులను ప్రకటించాక ఉమ్మడిగా తొలి సభను నిర్వహించుకుంటున్నాయి. అయితే.. తమ పరువు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినా కూడా ఫలితం లేకుండా పోయింది.  ఆఖరికి.. ‘సూపర్‌ సిక్స్‌’ కూడా జనాల్ని రప్పించలేకపోయింది. 

సీట్ల పంపకం తర్వాత రగిలిన అసంతృప్త జ్వాలలను కప్పిపుచ్చుకునేందుకు ఆ రెండు పార్టీలు బాగానే ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడిగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు జెండా పేరుతో తాడేపల్లి గూడెంలో సభను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సభ వేదికగానే.. తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీల కేడర్‌లు. అదే సమయంలో జనాలు సైతం ఈ సభను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.  టీడీపీ-జనసేన ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోతోంది.

చంద్రబాబు అసహనం
జెండా సభకు జనం భారీగా వస్తారనుకుంటే.. ప్రతిపక్షాలకు పెద్ద షాకే తగిలింది. జనాలు తరలించడంలో అటు టీడీపీ-ఇటు జనసేన నేతలు ఘోరంగా విఫలం అయ్యారు. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో చంద్రబాబు అసహనానికి గురయ్యారు. జనాలు ఎక్కడయ్యా? అంటూ పక్కనే ఉన్న బాలయ్యను చూస్తూ అసహనం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో సభాస్థలికి  వెళ్లకుండా కార్‌వాన్‌లోనే కాసేపు కూర్చుకున్నారు. కాసేపు ఆగితే ఇంకాస్త జనం ఎక్కువ అవుతారేమో అనే ఆశతో.. బాబు, పవన్‌, బాలయ్య ముగ్గురూ అక్కడే ఉండిపోయారు. 

సిద్ధంతో పోలిస్తే.. 
తమ ఉమ్మడి సభకు 6 లక్షల మంది దాకా వస్తారంటూ ఇరు పార్టీలు ప్రకటించుకున్నాయి. కానీ, 60 వేల మందికి మాత్రమే సరిపడా ఏర్పాట్లు చేశారు. పోనీ.. అంత మంది వచ్చారా? అంటే.. అంత లేదు. కుర్చీలు కూడా 8 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సభ 21 ఎకరాల్లో అని ప్రకటించుకున్న ఇరు పార్టీలు.. 13 ఎకరాల్లోనే గ్యాలరీలు ఏర్పాటు చేశారు.  ఒక్కముక్కలో చెప్పాలంటే సిద్ధం సభల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలం అంతకూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం.. దాని మిత్రపక్షం నిర్వహించే సభకు సమానంగా ఉందంటే అతిశయోక్తి కాదు.   

సూపర్‌ సిక్స్‌ పంచినా.. 
తాడేపల్లిగూడెం సభ కోసం టీడీపీ గిఫ్ట్‌లు పంచినా ఫలితం లేకుండా పోయింది.  ఓ బాక్స్‌లో ఐదు వేల నగదు.. ‍క్వార్టర్‌ బాటిల్‌.. మందులోకి మంచిగ్‌ కోసం స్టఫ్‌.. సిగరెట్లు.. కొన్ని స్వీట్లు..  కండోమ్‌ ప్యాకెట్‌.. లను ఉంచి ఉమ్మడి సభకు తరలించేందుకు జనాలకు తాయిలంగా ఇచ్చే యత్నం చేశారు. అయితే వాటిని కూడా కొందరు ఛీ కొట్టి సభకు వచ్చేందుకు విముఖత చూపించడం గమనార్హం.

 

కొసమెరుపు.. 
తాడేపల్లిగూడెం జెండా సభలో దృశ్యం ఒకటి.. నెట్టింట ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. సభ ఆరంభంలో టీడీపీ జెండాను పవన్‌.. జనసేన జెండాను చంద్రబాబు మోశారు. అది చూసి కొందరు.. ‘పవన్‌ ఇంతకాలంగా చేస్తోంది అదే కదా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top