పిఠాపురంలో పవన్‌ గెలవడు: ముద్రగడ | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో పవన్‌ ఎట్టిపరిస్థితుల్లో గెలవడు: ముద్రగడ

Published Sat, Mar 30 2024 10:50 AM

Mudragada Says Pwan Will Lost Pithapuram - Sakshi

కాకినాడ, సాక్షి:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్‌ వల్లే పవన్‌ రాజకీయ ఉనికి ఇంకా కొనసాగగలుగుతోందని ముద్రగడ కుండబద్ధలు కొట్టారు.  సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడ పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు.

పవన్‌ కల్యాణ్‌కు సినీ గ్లామర్‌ మాత్రమే ఉంది. అందుకే యువకులు ఆయన వెంటపడుతున్నారు. కానీ, ఏరకంగా చూసుకున్నా పవన్‌ కంటే ఆయన అన్న చిరంజీవి ఎంతో బెటర్‌. రాజకీయాలు పక్కనపెట్టి పవన్‌ చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు. అసలు పిఠాపురంలో ఎట్టిపరిస్థితుల్లో పవన్‌ గెలిచే ప్రసక్తే లేదు అని ముద్రగడ చెబుతున్నారు. 

ఇక తనపై పోలీసుల దాడి అప్పట్లో నారా లోకేష్‌ ఆదేశాల మేరకే జరిగిందని ముద్రగడ సంచలన ఆరోపణ చేశారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్‌ పాలనపై ముద్రగడ ప్రశంసలు గుప్పించారు. సీఎం జగన్‌ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. వైఎస్‌ జగన్‌ మాదిరిగా ఏ సీఎం ఇంత స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించలేదు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి) కంటే ఎక్కువ కాలం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేయాలి అని ముద్రగడ ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్‌సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement