రూ. 20 కోట్ల లంచం అడిగారు.. అడగలేదని ప్రమాణం చేయగలరా?

MLA Bolla Brahmanaidu Challenges Prathipati Pulla Rao - Sakshi

అమరావతి: గతంలో గౌతమ బుద్ధ టెక్స్‌టైల్స్‌ అనుమతికి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు లంచం అడిగారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. తాను పార్టీ మారడంతో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేసిన విషయాన్ని బ్రహ్మనాయుడు మీడియాకు తెలిపారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన బ్రహ్మనాయుడు.. ‘వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు. లంచం అడగలేదని ప్రతిపాటి పుల్లారావు ప్రమాణం చేయగలరా?, చంద్రబాబు హెరిటేజ్‌ డెయిరీ పెట్టిన నాటి నుంచి తొక్కేయాలని చూశారు.

హెరిటేజ్‌ను తిరుమల డెయిరీ క్రాస్‌ చేసింది. 2012లో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ కు టెండర్ వేశాను. టెండర్ ప్రకారమే డబ్బులు కట్టాను ...రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా. గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు నన్ను 20 కోట్లు లంచం అడిగారు. ఆ 20 కోట్లు చంద్రబాబు నుంచి లోకేష్ దాకా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు  నన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నా . కానీ ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదు. నన్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. నేను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని... అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నన్ను దెబ్బకొట్టాలన్నదే చంద్రబాబు ఉద్ధేశం’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top