బండి సంజయ్‌కు సవాల్‌ విసిరిన మంత్రి | Minister Vemula Prashanth Reddy Challenges To Bjp Mp Bandi Sanjay | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌కు సవాల్‌ విసిరిన మంత్రి

Feb 3 2021 2:38 PM | Updated on Feb 3 2021 3:41 PM

Minister Vemula Prashanth Reddy Challenges To Bjp Mp Bandi Sanjay  - Sakshi

కామారెడ్డి : బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి సవాల్‌ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం  ఇస్తున్న పెన్షన్ డబ్బుల్లో కేంద్రం ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే మించితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్‌ విసిరారు. తన సవాలు స్వీకరించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అంటే భారతీయ ఝటా పార్టీ అని, తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి ఇస్తే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఉద్రిక్తత: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ)

Advertisement
 
Advertisement
Advertisement