‘ఆ అక్రమాల్లో చంద్రబాబు పాత్ర?’

Minister Vellampalli Srinivas Comments On Chandrababu - Sakshi

సింహాచలం, మాన్సాస్‌ భూముల్లో పెద్దఎత్తున అక్రమాలు

పదేళ్లుగా మాన్సాస్‌లో ఆడిట్‌ జరగలేదు

దేవుడి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 

సాక్షి, విజయవాడ: సింహాచలం, మాన్సాస్‌ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడి భూములు కాజేసిన వారిని శిక్షించడానికే విజిలెన్స్ విచారణ చేపట్టామన్నారు. అక్రమాల్లో చంద్రబాబు పాత్ర కూడా ఉందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.

‘‘అశోక్‌గజపతి ఛైర్మన్‌గా వందల కోట్ల భూములకు ఎన్‌ఓసీలు ఇచ్చారు. 313 ఎకరాలకు అడగకుండానే ఎన్‌ఓసీలు ఇచ్చారు. ఎండోమెంట్ కమిషనర్ ఇవ్వాల్సిన ఎన్‌ఓసీలు సింహాచలం ఈవో ఇచ్చారు. పదేళ్లుగా మాన్సాస్‌లో ఆడిట్‌ జరగలేదు. దేవుడి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారని’ మంత్రి మండిపడ్డారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు కాపాడాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top