చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు..

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పేవి సొల్లు కబుర్లని ప్రజలకు తెలుసునని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డ ముసుగులో చంద్రబాబు చేయాలనుకునే కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. ప్రజాదరణ ఉన్న మేము ఎన్నికలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ మాటలు విని 100 మంది బరిలో దిగారని.. అభ్యర్థులను గాలికొదిలేసి చంద్రబాబు, లోకేష్ ఇంట్లో పడుకున్నారని విమర్శించారు. డిపాజిట్లు కూడా దక్కవని తెలిసే చంద్రబాబు, లోకేష్ మొహం చాటేశారని కొడాలి నాని వ్యగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: ఆ జిల్లా ప్రజలకు ఇది శుభవార్తే..)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి