KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్‌ | Minister Kakani Serious Comments Over Yellow Media And TDP Over False Allegations On Krishnapatnam Port - Sakshi
Sakshi News home page

KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్‌

Jan 25 2024 11:15 AM | Updated on Feb 4 2024 4:18 PM

Minister kakani Serious Comments Over Yellow Media - Sakshi

సాక్షి, నెల్లూరు: ఎల్లో మీడియా, టీడీపీపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టు టెర్నినల్‌పై ఎల్లో దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు. 

కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కొత్త ఫేక్‌ ప్రచారానికి తెరలేపింది. కేపీ పోర్ట్‌ తరలి పోతుందని ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు, కేపీ పోర్టు ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చింది. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 

అయితే, అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని సోమిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. పోర్టు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయ. కానీ, పోర్టు పురోగతికి ఎలాంటి ఢోకా లేదు. కేపీ పోర్టులో ఎలాంటి సర్వీసులు రద్దు కాలేదు. ఎక్కడికి తరలిపోలేదు. పోర్టు ఎలాంటి సర్వీస్‌ కూడా తొలగించలేదు. గతంలో పవర్ పొల్యూషన్‌పై కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి నాడు యాజమాన్యాలతో కుమ్ముక్కయ్యారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement