సంక్షేమాన్ని అడ్డుకోవడానికే టీడీపీ కేసులు: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

సంక్షేమాన్ని అడ్డుకోవడానికే టీడీపీ కేసులు: మంత్రి బొత్స

Oct 9 2021 2:40 PM | Updated on Oct 9 2021 3:24 PM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

కేంద్ర నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించామని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అన్నారు.

సాక్షి, విజయనగరం: కేంద్ర నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించామని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 220 చదరపు అడుగుల స్థలం ఇవ్వాలని నిబంధన ఉంటే.. 270 చదరపు అడుగుల స్థలం కేటాయించామని తెలిపారు. అధికారం కోల్పోయిన టీడీపీ.. సంక్షేమాన్ని అడ్డుకునేందుకే కేసులు వేస్తోందన్నారు. (చదవండి: ఇక గ్రామాల వారీగా బడ్జెట్‌లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యరిస్తామన్నారు. సాంకేతిక అంశాలు కాకుండా.. ఏ స్ఫూర్తితో చేస్తున్నామో చూడాలని కోరతామని మంత్రి తెలిపారు. ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా ఇచ్చినా హామీలను నెరవేరుస్తామని మంత్రి బొత్స అన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థం చేసింది చంద్రబాబే. గతంలో అధిక టారిఫ్‌లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే  విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. ఆ బకాయిలన్నింటినీ మా ప్రభుత్వం చెల్లిస్తోందని’’ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
చదవండి:
కోస్తాంధ్రకు మరో తుపాను!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement