ఆ దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తా: మంత్రి అంబటి

Minister Ambati Rambabu Slams Janasena Chief Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లా ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను చేయను అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు మంజూరైన పరిహారంలో రూ.2లక్షలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణపాయంగా వదిలేస్తానని మంత్రి అంబటి స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించాం. ఆగస్టు 20న మృతి చెందినవారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు జేబు పార్టీ నాపై ఆరోపణలు చేస్తే నేనెలా ఊరుకుంటా?. నాపై తప్పుడు ట్రోల్స్‌ చేస్తున్నారు. జనసేన అభిమాని చనిపోతే కనీసం పలకరించని కుసంస్కారం పవన్‌ది' అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

చదవండి: (బాపట్ల జిల్లా యడ్లపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top