
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్న ఆమె.. త్వరలోనే నామినేటెడ్,కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామని సూచించారు.
అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆమె పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన ప్రకటనల ఆధారంగా, ఇది కేవలం నేతలను చేర్చుకోవడమే కాకుండా, పార్టీలో అంతర్గత సమీకరణలను సమతుల్యం చేయడానికి కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం
పార్టీలోని నేతలను మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారు,ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినవారు ఇలా మూడు వర్గాలుగా విభజించారు.
వాటి ఆధారంగా పదేళ్లుగా పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, కేటగిరీల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుంది. అంటే పార్టీలో ఉన్న కాలం, నిబద్ధత ఆధారంగా అవకాశాలు కల్పించనున్నారు.