
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పండగ సందర్భంగా మెగా సెల్ పెట్టినట్లు ఫ్రీ గా మంత్రులు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌కి కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘పీపీపీ మంచిదని మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రైవేట్‌కి మెడికల్ కాలేజీలు ఇవ్వడం ట్రయిల్ రన్‌గా మొదలు పెట్టారా? అంటూ అప్పలరాజు ప్రశ్నించారు.
‘‘భవిష్యత్‌లో ఎన్ని చూడాలో.. టూరిజం కూడా ప్రైవేట్‌కి ఇచ్చేశారు.. అన్ని టూరిజం కార్యాలయాలను అమ్మకాలకు పెట్టారు. మంత్రులకు సిగ్గు ఉందా?. మంత్రులు రాజీనామా చేసి వల్ల పదవులు కన్సల్టెన్సీకి ఇవ్వండి.. వాళ్లు ప్రభుత్వం నడుపుతారు. మంత్రి పదవులు కాపాడుకోవడానికి పీపీపీని సమర్థిస్తారా?. పీపీపీ బాగుంటే, బ్రహ్మాండంగా ఉంటే ఎయిమ్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అప్పల రాజు నిలదీశారు.
టెక్నాలజీ మెరుగుపరచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. హోంమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫెయిల్యూర్ మంత్రులు. ఏది అడిగిన డబ్బులు లేవని అంటున్నారు.. మరి రెండు లక్షల కోట్లు అప్పు ఎక్కడ?. నచ్చిన పని చేయడానికి లక్షల కోట్లు అప్పులు చేస్తారు. పేద ప్రజలకు సీట్లు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఉన్నట్లు నడిపితే 2500 కోట్లు మిగులుతుంది. 11 వేల కోట్లు లాస్ట్ 5 ఏళ్లలో ఖర్చు చేశాం. కోటి 43లక్షల కుటుంబాలకు 3575 కోట్లు ఖర్చు అవుతుంది.
..2500 రూపాయల చొప్పుమ 4075 కోట్లు ప్రీమియం ఇస్తున్నారు.. ఏడాదికి 5 కాలేజీలు ప్రారంభించండి. 8400 కోట్లు 17 మెడికల్ కాలేజీలకు బడ్జెట్ అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా మెడికల్ కాలేజీలు నిర్మించాలో గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సోషలో మీడియాలో అసత్యాలు మాట్లాడే వాళ్లపై కేసులు పెట్టాలి అంటే అనిత మీద పెట్టాలి. 24-25 సంవత్సరంలో క్లాసులు తరగతులు నిర్వహించడానికి అవసరం అయినా పనులు పూర్తయినట్లు ఈనాడులో రాసారు. మెడికల్ కాలేజీలు తానే తీసుకొని వచ్చానని చంద్రబాబు అబద్ధాలు చెపుతున్నాడు.
..గతంలో ఎప్పుడో వచ్చిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు తన అకౌంట్‌లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు, తిరుపతిలో మెడికల్ కాలేజీలు 2014 జూన్‌లో ప్రారంభం అయితే అదే నెలలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎలా పర్మిషన్ తీసుకొని వస్తారు. 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కి అమ్మడం అంటే అంత కంటే దౌర్భాగ్యం ఉండదు. 2015 లో వేసిన సీఆర్‌డీఏకి వేసిన పునాది ఫొటోస్ నేడు గూగుల్‌లో చూపిస్తుంది. మార్కాపురం, మదనపల్లి, బాపట్ల బిల్డింగ్స్ గూగుల్‌లో కనిపిస్తాయి.

..పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ కాలేజీల గురించి మంత్రి అనిత తగ్గించి మాట్లాడతారా? ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ప్రైవేటైజేషన్ సక్సెస్ స్టోరీ అని చంద్రబాబు ఒక పుస్తకం రాశాడు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కి అమ్మేయడాన్ని పొగుడుకొంటూ ఆయనకు ఆయన రాసుకున్నారు. పీపీపీ అంటే పే ఫర్ ప్రాజెక్టుగా అర్థం మార్చేశారు. టూరిజం డిపార్ట్‌మెంట్‌లు, హాస్పిటల్, ఆరోగ్యశ్రీ అన్ని ఇచ్చేసారు.. రాష్టాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టేసారు. లులూ మాల్‌కి ప్రైమ్ లొకేషన్‌లో ఫ్రీగా స్థలం ఇచ్చేశారు. పీపీపీకి ప్రైవేట్ కాలేజీలు ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలి.. లేదంటే పోరాటం చేస్తాం’’ అని అప్పలరాజు హెచ్చరించారు.