‘మహా’ ఎన్నికలు: బీజేపీపై నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు | Maha Polls: Nana Patole attack controversy comments on BJP leaders | Sakshi
Sakshi News home page

‘మహా’ ఎన్నికలు: బీజేపీపై నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు

Nov 12 2024 11:43 AM | Updated on Nov 12 2024 12:02 PM

Maha Polls: Nana Patole attack controversy comments on BJP leaders

ముంబై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఓబీసీ కమ్యూనిటీ విషయంలో బీజేపీ పార్టీ నేతలు కుక్కలా వ్యవహరిస్తారని మండిమండ్డారు. ఓబీసీలంతా తామేంటో బీజేపీకి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆయన అకోలాలో జరిగిన  ఎన్నికల ప్రచారం ర్యాలీలో  పాల్గొని ప్రసంగించారు.

‘‘బీజేపీ నేతుతు తమను తాము ‘దేవుళ్లుగా’గా భావిస్తున్నారు. మిమ్మల్నీ కుక్కలుగా భావించే.. బీజేపీకి అకోలా జిల్లా ఓబీసీ ప్రజలు ఓటేస్తారా?. ఇప్పుడు బీజేపీని మీరు(ప్రజులు) కుక్కలా చేసే సమయం వచ్చింది. మహారాష్ట్ర నుంచి బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా విశ్వగురువుగా భావించుకుంటారు. బీజేపీ నేత ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement