నాపైనే టీడీపీ, ఆ మీడియా టార్గెట్‌  | Kodali Nani Fires On TDP And Yellow Media | Sakshi
Sakshi News home page

నాపైనే టీడీపీ, ఆ మీడియా టార్గెట్‌ 

Jan 25 2022 3:34 AM | Updated on Jan 25 2022 8:00 AM

Kodali Nani Fires On TDP And Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీతో పాటు మీడియాలో ఓ వర్గం కేవలం తనపైనే దృష్టి పెట్టిందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌ అని అన్నారు. గుడివాడలో కేసినో నిర్వహించానంటూ అసత్య ఆరోపణలు చేసిన బాబు.. దొంగలు, 420లతో నిజనిర్థారణ కమిటీ వేశారని మంత్రి మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తి విపక్ష నేతగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని వ్యాఖ్యానించారు. గుడివాడలోని తన ‘కె–కన్వెన్షన్‌’లో కేసినో జరిగిన ఘటన నిజమని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సవాల్‌ విసిరితే, టీడీపీకి చెందిన 420 నేతలు మాటమార్చారని.. ఇప్పుడు దాని సమీపంలో అని కూడా కాకుండా, గుడివాడలో జరిగిందంటున్నారని ఎద్దేవా చేశారు. తాను కరోనాతో ఆసుపత్రిలో ఉంటే తనపై ఇష్టంవచ్చినట్లు టార్గెట్‌ చేశారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో ఉన్న సభ్యులను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు.  

వీళ్లూ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు 
‘420లు, మర్డర్‌ కేసులో ఉన్నవాళ్లు, సీఐగా ఉన్నప్పుడు ఒళ్లు అమ్ముకునే వాళ్ల వద్ద కూడా డబ్బులు కొట్టేసిన వాడు, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌లో ఉన్నవాళ్లు నిజనిర్ధారణ కమిటీలో సభ్యులు. వీరు ఇప్పుడు డీజీపీపై పడి ఏడుస్తున్నారు. వీరిని అధికారులు ఎందుకు గౌరవిస్తారు? డీజీపీ విజయవాడ పోలీసు కమిషనర్‌గా చేశారు. ఈ బుద్ధా వెంకన్న, బొండా ఉమా ఎలాంటి వాళ్లో  ఆయనకు బాగా తెలుసు. కొడాలి నాని, డీజీపీ అంటే కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ అనుకుంటున్నావా బుద్ధా? నువ్వు పిచ్చివాగుడు వాగితే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజలు వీళ్లను రాజకీయంగా సమాధి చేసి రెండున్నరేళ్లు అయింది. వచ్చే ఎన్నికలు కాదు కదా, సమీప భవిష్యత్తులో టీడీపీ గెలిచేది లేదు. 2024 కాదు 2034 వరకు టైమిస్తున్నా.. చంద్రబాబు అండ్‌ కో గెలిచి చూపించండి. ఇక మీరు చెబుతున్నట్లుగా కేసినోకు వచ్చిన మహిళల విమాన టికెట్లు మీకెలా వచ్చాయి? వాటిని మీరే బుక్‌ చేశారా? మహిళలంటే గౌరవం లేని ఇటువంటి నీచులకు మహిళ కనపడగానే అర్ధనగ్నం.. వారంతా వ్యభిచారానికి వచ్చారని చెప్పే దిక్కుమాలిన పరిస్థితిలో ఈ చంద్రబాబు, ఆయన పార్టీ వాళ్లూ ఉన్నారు’ అని నాని విరుచుకుపడ్డారు. 

బాబూ.. నీ ఇంట్లోకి నాకు అనుమతిస్తావా? 
చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది.. తాను కెమెరా తీసుకుని వస్తానంటే ఆయన పర్మిషన్‌ ఇస్తాడా? అని మంత్రి సూటిగా అడిగారు. ఎవరో ఏదో చేస్తే చంద్రబాబు దానిని మాపై రుద్దుతారని.. తర్వాత టీడీపీ వాళ్లు మహిళలతో తిట్టిస్తారని ఆయన విమర్శించారు. తాను ఖర్జూరనాయుడు పేరు ఎత్తకూడదంట కానీ, వారు రాజారెడ్డి రాజ్యాంగం అని ఎన్నిసార్లయినా అనొచ్చంట అంటూ ఎద్దేవా చేశారు. 420లతో మమ్మల్ని మీరు తిట్టించడం ఆపితే నేను ఆపుతా.. లేకపోతే చర్యకు ప్రతిచర్య ఉంటుందని కొడాలి హెచ్చరించారు. అసలు జూద, వ్యభిచార గృహాలు నడిపిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. ఇక సీఎం జగన్‌కు ఈ రాష్ట్ర ప్రజలిచ్చే సర్టిఫికెట్‌ ముఖ్యం కానీ, ఈ పచ్చ మీడియా ఇచ్చేది కాదని మంత్రి స్పష్టంచేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement