మందకృష్ణ మాదిగ 25 కోట్లు అడిగారు: కేఏ పాల్‌

Ka Paul Comments On Manda Krishna Madiga - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి సింబల్‌ ఇవ్వలేదని, దీని పై హైకోర్టుకు వెళ్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పా డాలన్నారు.

‘మా పార్టీలో చేరాలని మందకృష్ణ మాదిగను కోరితే, రూ. 25 కోట్లు అడిగారని, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన అమ్ముడుపోయారు’అని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాదిగల బహిరంగసభ నిమిత్తం మందకృష్ణకు రూ.72 కోట్లు ముట్టాయని, ఎంపీ పదవి ఇస్తారని ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని విమర్శించారు. మాదిగలకు మోదీ ఇన్నిరోజుల్లో చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా అని కేఏ పాల్‌ నిలదీశారు.
చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top