
భువనగిరిలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు. పక్కన జగదీశ్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు
సాక్షి, యాదాద్రి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడి 25 ఎంపీ సీట్లలో 4,5 మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని, ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని, తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామరక్షని చెప్పా రు. భువనగిరిలో శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు(కేఆర్‌ఎంబీకి) అప్పగించ డం వల్ల నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఈనెల 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మేమే పూర్తిచేశాం
నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. రైతుబంధు డబ్బులు పడటం లేదని ప్రశ్నిస్తే రైతులను చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ దు్రష్పచారం చేసిందని మండిపడ్డారు. రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్ వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు.
ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్‌ను ముట్టుకుంటే ఏం జరుగుతుందో చూడాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. సమావేశంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.