
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాత్రికి బీజేపీ తన తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. 20 నుంచి 23 స్థానాలతో బీజేపీ తుది జాబితాను విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
బీజేపీ తుది జాబితాను రాష్ట్ర నాయకత్వమే ప్రకటించే చాన్స్ ఉంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు సమాచారం. మరొకవైపు ఈ నెల 12 లేదా 13న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది.