మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Eknath Shinde Government Wont Fall: Ajit Pawar Big Remark - Sakshi

ముంబై: షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వంపై ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో తిరుగుబాటు చేసిన షిండేకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా అధికార ప్రభుతానికి ఎలాంటి ముప్పు లేదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా అప్పటి మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగరవేసిన ఏక్‌నాథ్‌ షిండే వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్ధవ్‌ వర్గం శివసేన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు 79 పేజీల లేఖను అందజేసింది. స్పీకర్‌ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల డిప్యూటీ స్పీకర్‌కు లేఖ అందించినట్లు శివసేన నేత ప్రభు తెలిపారు. 
చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్‌ నుంచి వసూలు చేసుకోండి!

దీనిపై అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ..ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. షిండే, ఫడ్నవీస్‌ల ప్రభుత్వం పడిపోదని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం ముంబైలో విలేకరు సమావేశంలో పేర్కొన్నారు. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ప్రభుత్వం తన మెజారిటినీ కోల్పోదని తెలిపారు.  కాగా ఏక్‌నాథ్‌ షిండే శివసేన, బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం అధికార కూటమికి 162 మంది శాసన సభ్యుల బలం ఉంది. అంతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే 17 మంది ఎక్కువే ఉన్నారు.

ఇదిలా ఉండగా శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సభలో ఉద్ధవ్‌ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించడం సరైంది కాదని తెలిపింది. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ తన విచక్షాణాధికారాలను ఉపయోగించిన తీరు చట్టబద్దంగా లేదని తెలిపింది. అయితే ఉద్ధవ్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. శాసనసభలో బల పరీక్షలను ఎదుర్కోకుండా ఆయన స్వచ్చందంగా రాజీనామా చేశారని తెలపింది. 
చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top