అభిషేక్ బెనర్జీపై గుడ్లు, రాళ్లతో దాడి.. ‘చోర్ చోర్’ అంటూ.. | Eggs And Stones Thrown At TMC MP Abhishek Banerjee By Protestors, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అభిషేక్ బెనర్జీపై గుడ్లు, రాళ్లతో దాడి.. ‘చోర్ చోర్’ అంటూ..

May 30 2026 5:22 PM | Updated on May 31 2026 7:54 PM

 Eggs stones thrown at TMC MP Abhishek Banerjee

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసిరారు. 

దీంతో అభిషేక్‌ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్‌ పెట్టుకున్నారు.  ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

ఎన్నికల అనంతరం హింస జరగడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. దాడి జరుగుతున్న వేళ భద్రతా సిబ్బంది అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టి రక్షణ కల్పించారు ఘటనాస్థలిలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. “ఇది పూర్తిగా బీజేపీ ప్రేరేపిత చర్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు. అయినా పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారి గుర్తింపు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement