
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై దివ్యవాణి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ మేరకు దివ్యవాణి మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. టీడీ జనార్దన్ కోవర్టులు కంట్రోల్‌లో ఉండకపోతే ఇక నేను ఊరుకోను. అనిత, గ్రీష్మ నాపై మాట్లాడేముందు ఆలోచించుకోండి. అనవసరంగా మాట్లాడటం తగదు. పట్టాభి విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో. వల్లభనేని వంశీ గతంలో ఎందుకు బాధ పడ్డారో నాకు ఇప్పుడు తెలుస్తోంది. టీడీపీలో కొందరు మహిళలను ట్రోల్ చెయ్యడమే పనిగా ఉన్నారని' దివ్యవాణి మండిపడ్డారు.
చదవండి: (కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్)