టీడీపీ డీలా!

Disappointment Among TDP Leaders With Panchayat Election Results - Sakshi

అగ్నిపరీక్షగా చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలు 

బాధ్యత తీసుకునేందుకు ముందుకు రాని నేతలు

పంచాయతీ ఫలితాలతో నీరుగారిన తమ్ముళ్లు 

చిత్తూరు అర్బన్‌: పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బేజారైన తమ్ముళ్లు మున్ని‘పోల్స్‌’కు దూరంగా ఉన్నారు. 30 మందికి పైగా సిట్టింగ్‌ కార్పొరేటర్లు పోటీకి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. మార్చి 2, 3 తేదీల్లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అసలు పోటీలో ఎవరైనా ఉంటారా అనే ప్రశ్న టీడీపీ నేతలను వేధిస్తోంది

సిట్టింగులు దూరం 
చిత్తూరు నగరపాలక సంస్థకు మొదటిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో 30కి పైగా స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కటారి అనురాధ చిత్తూరు తొలి మేయర్‌గా పీఠం అధిష్టించారు. అయితే ఆమెకు మేయర్‌ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ను వారి రక్తసంబం«దీకులే మట్టుపెట్టారు. అనంతరం నలుగురు మహిళా కార్పొరేటర్ల భర్తలు కార్పొరేషన్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు ప్రజలు ఏకపక్షంగా మద్దతుగా పలికి ఆరణి శ్రీనివాసులును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం కార్పొరేషన్‌ ఎన్నికలు మళ్లీ వచ్చాయి. అయితే నాడు కోట్లు కొల్లగొట్టినవారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధ్యత తీసుకుంటే దాచుకున్న మూటలను బయటకు తీయాల్సివస్తుందని ఇంటికే పరిమితమయ్యారు.

టీడీపీలో ఆందోళన
టీడీపీ తరఫున అభ్యర్థులు దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు అనామకులతో  నామినేషన్లు వేయించారు. బతిమిలాడి.. డబ్బులిచ్చి బరిలో దించిన తమ్ముళ్లు ఇప్పుడు కనిపించకపోవడంతో చిత్తూరు టీడీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు నగర పార్టీకి అధ్యక్షుడినే నియమించకపోవడంతో ఎవరికి వారు తమ కెందుకులే అని పక్కకు తప్పుకుంటున్నారు. ప్రస్తుత కీలక సమయంలో నూ కనీసం పార్టీ కార్యాలయానికి వచ్చేవారు కూడా కనిపించడంలేదు. దీంతో చిత్తూరు నగర టీడీపీలో నిస్తేజం ఆవరించింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ మొత్తం 50 డివిజన్లుకు అభ్యర్థులను ప్రకటించేసింది. పోటీలో దిగిన అభ్యర్థులు ప్రచా రంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ జిల్లా నాయకులు కింకర్తవ్యం అంటూ మధనపడుతున్నారు.  ఎవరికి వారు దూరంగా ఉండిపోతున్నారు.
చదవండి:
బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం!    
చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top