విజయ్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు! | Congress MLA says long live Rahul Gandhi during oath | Sakshi
Sakshi News home page

విజయ్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!

May 21 2026 7:53 PM | Updated on May 21 2026 8:12 PM

Congress MLA says long live Rahul Gandhi during oath

చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్‌ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్‌ దక్కింది.  ఫలితంగా కాంగ్రెస్‌ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. 

దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్,  పి. విశ్వనాథన్‌లు విజయ్‌ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. 

అయితే మంత్రిగా ఎస్‌ రాజేష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్‌ గాంధీ, రాహుల్‌ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్‌ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్‌.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్‌కుమార్‌కు గుర్తు చేశారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement