
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్‌కు రావాలా? అంటూ రేవంత్ చమత్కరించారు. బనకచర్ల చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పిందని ఒక ప్రశ్నక సమాధానంగా చెప్పారు సీఎం రేవంత్. ‘ ‘కేసీఆర్ సభకు రావాలి. గత ప్రభుత్వం అవినీతిపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ కొనసాగుతోంది. శాఖాపరమైన విచారణ రాత్రికి రాత్రే పూర్తి కాదు. విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు’ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.
‘కేటీఆర్‌ను కాపాడాలని కిషన్‌రెడ్డి చూస్తున్నారు. అందుకే కాళేశ్వరం, ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుంది. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతాం. రెండేళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని రేవంత్ తెలిపారు.
చంద్రబాబు తొత్తు రేవంత్: కేటీఆర్
సిరిసిట్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకుందే చంద్రబాబని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కులను కాపాడటానికి కేసీఆర్ ఉన్నారని, బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చకోకపోతే మరొకసారి ఉద్యమానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతోందన్నారు. చిలుక రేవంత్ అయతే పలుకులు చంద్రబాబువి అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఏ బేసిన్‌లో ఏ ప్రాజెక్టు ఉందో సీఎం రేవంత్‌కు తెలియదని, ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.