
కొత్తగూడెం: పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. జూలై 10వ తేదీ) కొత్తగూడెంలో తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేది డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా చేస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామన్నారు. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం. మేం మహిళలం అందరం పోలీస్ కమాండ్ సెంట్రల్‌ఖు వస్తాం. వీటిపై చర్చిద్దాం’ అని కవిత సవాల్ చేశారు.
LIVE: తెలంగాణ జాగృతి విస్తృత సమావేశం, కొత్తగూడెం https://t.co/q9knIqkTGN
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 10, 2025