2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్‌లో హరీష్‌ రావు ఫొటో | BRS MLA Harish rao Photos trending In Social Media | Sakshi
Sakshi News home page

2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్‌లో హరీష్‌ రావు ఫొటో

Jun 21 2025 12:50 PM | Updated on Jun 21 2025 2:05 PM

BRS MLA Harish rao Photos trending In Social Media

సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్‌ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. ఫుల్‌ జోష్‌లో కనిపించారు.

పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. 

మరోవైపు.. హరీష్‌ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై కేసు పెట్టడం.. కేసీఆర్‌ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని  అడుగుతున్నాడు. కౌశిక్‌ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్‌ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement