హైదరాబాద్: ‘సర్’ ఇప్పడు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, దీని పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమావేశం నిర్వహించగా అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ SIR ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
SIR పేరుతో ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఓటు అనేది ప్రతి ఒకరి హక్కు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారు. SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలి. ఓటు హక్కు తొలగించే హక్కు ఎవరికి లేదు. కానీ ఈ కేంద్రం SIR పేరుతో తొలగిస్తుంది. 18 సంవత్సరాల నిండిన వారు ఓటు ఎన్రోల్ మెంట్ చేసుకోవాలి. బీఆర్‌ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున జరగాలి.
ఈసారి మెంబర్ షిప్ డ్రైవ్ డిజిటల్ లో చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేశాం. కంటోన్మెట్ ప్రజలు సురక్షిత మంచినీరు అందజేశాం. అలవీ కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చాక.. హామీలు గాలికి వదిలేశారు. ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది’ అని మండిపడ్డారు.


