ఫొటోలకు పోజులు కాదు.. బుక్కెడు బువ్వ పెట్టండి: కేటీఆర్‌ | BRS KTR Satirical Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

ఫొటోలకు పోజులు కాదు.. బుక్కెడు బువ్వ పెట్టండి: కేటీఆర్‌

Dec 14 2024 12:11 PM | Updated on Dec 14 2024 12:23 PM

BRS KTR Satirical Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని తెలిపారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘కాంగ్రెస్‌ పాలనలో సామాన్య విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగాయి. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయి. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి.

బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ నెలకొంది. కెమెరాల ముందు హంగామా చేయడం కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి.. సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement