
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్ అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా?. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం’ అని చెప్పుకొచ్చారు.
18 నెలలుగా తెలంగాణ టైమ్ పాస్ పాలన నడుస్తుంది. మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు.. ఎక్కడికి పిలిచిన రెడీ. 72 గంటల సమయం రేవంత్‌కు ఇస్తున్నాం. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు, అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు. ప్రతీ మండలం లో ఎరువుల కోసం క్యూ లైన్ లో రైతులు ఎదురు చూసే పరిస్థితి. కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. రైతులకు రైతు భీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్..

చంద్రబాబు బనకచర్ల ద్వారా తెలంగాణ రైతుల గొంతు కోస్తున్న మాట వాస్తవం. ఆంధ్రా ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారా రేవంత్?. బురద చల్లడం పక్కకు వెళ్ళడం రేవంత్‌కు అలవాటు. రుణ మాఫీ 12 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతులను, మహిళలను, కౌలు రైతులను మోసం చేసింది. 400 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. ఒక్క కొత్త పథకం ప్రారంభించ లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీకి మూటలు పంపించడం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం తప్ప రేవంత్‌కు మరో పని లేదు. రేవంత్‌కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు కోవర్టు రేవంత్. తెలంగాణలో జరుగుతుంది కోవర్టు పాలన’అని విమర్శించారు.