హరీష్‌ రావు బీజేపీలోకి రావచ్చు.. కానీ కండీషన్‌ ఇదే: బండి సంజయ్‌ | Bandi Sanjay Interesting Comments On Harish Rao Over Party Change, More Details Inside | Sakshi
Sakshi News home page

హరీష్‌ రావు ప్రజల మనిషి.. బీజేపీలోకి రావచ్చు కానీ..: బండి సంజయ్‌

Jul 14 2024 5:31 PM | Updated on Jul 14 2024 6:52 PM

Bandi Sanjay Interesting Comments On Harish Rao

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న వేళ కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రజల మనిషి. ఆయన బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అని కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.

కాగా, బండి సంజయ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌ పార్టీలో హరీష్‌ రావు ఒక్కడే వివాదరహితుడు. ఆయన ప్రజల మనిషి. ఒకవేళ హరీష్‌ రావు బీజేపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా పార్టీ చేరాలి. బీజేపీలో ఎవరు చేరినా రాజీనామా చేసి రావాల్సిందే. తర్వాత జరిగే ఎన్నికల్లో వారిని గెలిపించుకుంటామన్నారు.

ఇదే సమయంలో బీజేపీలో బీఆర్‌ఎల్పీ విలీనం అనేది కాంగ్రెస్‌ ఆడుతున్న డ్రామా మాత్రమే. కాంగ్రెస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement