 
													చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల
ప్రధానాధికారికి బీజేపీ వినతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేప థ్యంలో ఒక వర్గం ఓటర్లను ప్రలోభపరిచేలా సీఎం వ్యవహరిస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ అజహ రుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టే ప్రయత్నాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.
ప్రభుత్వ చర్యను ఉపసంహరించేలా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరింది. గురువారం ఈ మేరకు సీఈవోకు బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, లీగల్ సెల్ నేత ఆంథోనిరెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ప్రతిపాదన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
