ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌

Assembly Election 2021 Exit Poll Results - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడింది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో అత్యధికంగా ప్రజలు అధికార పార్టీలకే పట్టం కట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రం డీఎంకే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడించాయి. ఇక బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీల మధ్య రసవత్తర పోరు సాగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం అయినప్పటికి ఈ సారి మాత్రం టీఎంసీకి గట్టి పోటీనే ఇచ్చినట్లు పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి. ఇక ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌ (294 సీట్లు)...
సీఓటర్ సర్వే: టీఎంసీదే విజయం
సీఓటర్: టీఎంసీ 158, బీజేపీ 115, కాంగ్రెస్ ప్లస్ - 19
బెంగాల్ పీమార్క్ : బీజేపీ 120, టీఎంసీ 158, లెఫ్ట్‌+ 14
బెంగాల్ ఈటీజీ : బీజేపీ 110, టీఎంసీ 169, లెఫ్ట్‌+ 12
రిపబ్లిక్‌-సీఎన్‌ఎక్స్ : బెంగాల్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ
రిపబ్లిక్‌-సీఎన్‌ఎక్స్: టీఎంసీ 128-138, బీజేపీ138-148, కాంగ్రెస్: 11-21
సీఎన్‌ఎన్: టీఎంసీ 128-132, బీజేపీ: 138-148, ఇతరులు - 20

అస్సోం(126 అసెంబ్లీ స్థానాలు)...
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: అసోంలో బీజేపీదే విజయం.
బీజేపీ: 75-85, కాంగ్రెస్‌: 40-50
రిపబ్లిక్‌ ఎగ్జిట్‌పోల్: బీజేపీ 74-84, కాంగ్రెస్: 40-50

కేరళ (140 అసెంబ్లీ స్థానాలు)...
రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: లెఫ్ట్‌ఫ్రంట్ 70-80, కాంగ్రెస్ 40-50

తమిళనాడు (234 అసెంబ్లీ స్థానాలు)..
రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: డీఎంకే 160 -170, అన్నాడీఎంకే 58-68

పుదుచ్చేరి (30 అసెంబ్లీ స్థానాలు) 
ఇక్కడ బీజేపీకి విజయవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top