రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడితే ఊరుకోం | Alleti Maheshwar Reddy Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడితే ఊరుకోం

Jul 7 2024 6:11 AM | Updated on Jul 7 2024 6:11 AM

Alleti Maheshwar Reddy Comments On CM Revanth Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని స్వాగతిస్తున్నాం: ఏలేటి  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్ర యోజనాల విషయంలో రాజీపడితే చూస్తూ ఊరుకో బోమని బీజేఎల్పినేత ఏలే టి మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల భేటీని స్వాగతిస్తున్నామన్నారు. శనివా రం అసెంబ్లీ మీడియా హాల్‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అందుబాటులోకి రావడం లేదని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే స్పీకర్‌ తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఈ అంశం హైకోర్టులో కేసు ఉందని, తాము అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సర్కార్‌ పెద్దలు, వివిధ ట్యాక్సుల పేరుతో అవినీతికి పాల్పడిన తీరును తాను వాస్తవాలతో బయటపెట్టానని తెలిపారు. ముఖ్యంగా సివిల్‌ సప్లయ్‌ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే విచారణ జరుగుతుందని తెలిపారు. 

వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో.. 
గత ప్రభుత్వంలో సర్పంచులు లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించారని, కానీ, కేసీఆర్‌ సర్కారు ఆ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఏలేటి చెప్పారు. ‘రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో పంచాయతీలో రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయి ఉన్నట్లు సర్పంచులు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తమ్మీద రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉన్నట్లు సమాచారం. పది శాతం కమీషన్లు ఇస్తే తప్ప ఆర్ధిక శాఖ బిల్లులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వెయ్యి కోట్లకుపైగా ఉన్న పెండింగు బిల్లులను క్లియర్‌ చేసేందుకు పది శాతం కమిషన్‌ అంటే.. వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో’అని మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement