మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

పెద్దపల్లిరూరల్‌: మత్స్యకారులు చేపల పెంపకం, వాటి ద్వారా ఆహార పదార్థాలు, పచ్చళ్ల తయారీతో ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అన్నారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో మహిళా మత్స్యకార సంఘ సభ్యులుగా ఎన్నికై న వారితో అధికారులు సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. సంఘం అధ్యక్షురాలిగా కలవేన వనిత, ఉపాధ్యక్షురాలిగా స్వప్న, కోశాధికారిగా మమత, డైరెక్టర్లుగా సుజాత, పద్మ, శ్రీలత, సుకన్య, లక్ష్మి, స్వప్న బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెర్క రిబిక, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌తోపాటు సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement