దసరాకు గుడుంబా సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

దసరాకు గుడుంబా సిద్ధం!

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

పల్లెల్లో గుట్టుగా తయారీ పండుగ లక్ష్యంగా దందా? ఒకవైపు పోలీసుల నాకాబందీ మరోవైపు ఎకై ్సజ్‌ అధికారుల దాడులు అయినా ఆగని నాటుసారా గుప్పు

మంథని: తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా మద్యం విక్రయాలు జోరందుకుంటాయి. దీనిని అదనుగా తీసుకొని కొందరు వ్యాపారులు నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అధికారుల దాడులతో గతంలో తగ్గుముఖం పట్టినా.. ఇటీవల మంథని, రామగిరి ప్రాంతాల్లో పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గుడుంబా, నాటుసారా పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

పండుగకు ముందే పల్లెల్లో ఏర్పాట్లు

కరీంనగర్‌ తూర్పు డివిజన్‌ తూర్పుపల్లెల్లోని అటవీ గ్రామాల్లో ఒకప్పుడు నాటుసారా గుప్పుమనేది. ప్రభుత్వం, అధికారులు ఉక్కుపాదం మోపి చాలావరకు కట్టడిచేశారు. బెల్ట్‌షాపులు ఏర్పాటై ఛీప్‌లిక్కర్‌ అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియిలు గుడుంబాకు దూరమయ్యారు. కానీ, కొంతకాలంగా నాటుసారా తయారీ కేంద్రాలు వెలుగులోకి రావడంతో దందా మళ్లీ మొదలైనట్లు అనుమానాలు వక్తమవుతున్నాయి. పట్టణాల్లో మద్యం కొనుగోళ్లు పెరిగితే.. గ్రామాల్లో కొందరు నాటుసారాను ఆశ్రయిస్తున్నారు. పల్లెవాసుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని కొందరు గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారీ చేస్తున్నారని సమాచారం. జనావాసాలకు దూరంగా వాగులు, వంకలు, అటవీ పరిసరాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం అధికారుల నిఘాకు సవాల్‌గా మారుతోంది.

బోయినపేటలో నాకాబందీ

మంథని మున్సిపల్‌ పరిధిలోని బోయిన్‌పేటలోనూ పెద్దఎత్తున నాటుసారా విక్రయాలు జరిగేవి. గుడుంబా తాగిన అనేకమంది అనారోగ్యంపాలు కావడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం.. కాలక్రమేనా విక్రయాలు తగ్గిపోవడం.. వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంతో చాలామంది నాటుసారా తయారీ, విక్రయాలు మానేశారు. ప్రస్తుతం బొక్కలవాగు శివారులో తయారవుతుందనే సమాచారంతో గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ ఆధ్వర్యంలో ఇటీవల బోయిన్‌పేటలో నాకాబందీ నిర్వహించి నాటుసారా పట్టుకున్నారు. అంతకుముందు మంథని సీఐ స్వామి, ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ బొక్కలవాగు శివారులో దాడులు నిర్వహించి బెల్లంపానకం పారబోశారు. గతనెల 30న బోయిన్‌పేటలోని ఇళ్లను ఆనుకొని ఉన్నప్రాంతాల్లో ఎకై ్సజ్‌ సీఐ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో 1,200 లీటర్ల బెల్లంపానకం పారబోశారు. 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

రామగిరి మండలంలో ఎకై ్సజ్‌ దాడులు

రామగిరి మండలంలోని వివిధ ప్రాంతాలతోపాటు బోయినపల్లి పరిసరాల్లోనూ ఎక్సైజ్‌ శాఖ అధికారు లు ఇటీవల పెద్దఎత్తున దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాటుసారా తయారీ కేంద్రాలు, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సా రిస్తున్నారు. గతంలోనూ పులిసిన బెల్లంపానకం, నాటుసారా నిల్వలు బయటపడ్డాయి.

దాడులు చేస్తున్నా.. ఎలా?

పోలీసులు నాకాబందీ, ఎకై ్సజ్‌ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా నాటుసారా తయారీ తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తోంది. ఒకచోట దాడిచేసి నిల్వలను ధ్వంసం చేయడంతోనే సమస్య పరిష్కారం కాదని, తయారీకి అవసరమైన ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తోంది? విక్రయాలకు సహకరిస్తున్న వారెవరు? తయారీదారులకు సమాచారం చేరవేస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందా? అనే అంశాలపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement