పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా వెనువెంటనే విచారణ జరిపి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈమేరకు వివిధ విభాగాలకు అర్జీలను రెఫర్ చేశారు. కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
నరకప్రాయంగా రోడ్డు
పెద్దపల్లి 19వ వార్డు బండారికుంట మెయిన్‌రోడ్డుపై లారీల రాకపోకలు నిలిపివేయాలి. వాటి రాకపోకలతో రోడ్డు ధ్వంసమైంది. తాగునీటి పైపులు పగిలి నీరు వృథాగా పోతోంది. ఇళ్లగోడలు బీటలు వారుతున్నాయి. భయంగా బతుకుతున్నాం.
– బండారికుంటకాలనీ వాసులు
బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మాకు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టులు గుర్తించి వెంటనే భర్తీ చేయాలి. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, వర్క్ ఆఫీసర్ తదితర ఖాళీలు భర్తీచేయాలి. అధికారులు ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలి. – దివ్యాంగులు


