పెద్దపల్లి: గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా 2026 కార్యక్రమాలను ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ ఇతివృత్తంతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛతా కార్మికులను భాగస్వామ్యం చేస్తూ గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, పార్కులు, ప్రజాప్రదేశాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడతారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై అవగాహన, చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ, ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రచారం నిర్వహించనున్నారు. అక్టోబర్ 2న ప్రత్యేక కార్యక్రమాలతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ముగించనున్నారు.
రోజువారీ కార్యక్రమాలు
పకడ్బందీగా ఏర్పాట్లు
గ్రామపంచాయతీల వారీగా అందరికీ సమాచారం ఇచ్చాం. గురువారం నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి విజయవంతం చేసేలా చూడాలి.
– రాఘవులు, ఆర్పీ, డీఆర్డీవో, పెద్దపల్లి
జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం
అక్టోబర్ 2వరకు నిర్వహణ


