ధర్మారం: విశ్వకర్మలకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వపరంగా విశ్వకర్మల సంక్షేమానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, గ్రామ అధ్యక్షులు శ్యాంసుందర్, దామోదర్, రాజమౌళి, బుచ్చన్న, చారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్లానాయక్, మేడారం సర్పంచ్ వీర్‌పాల్, సంఘం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వకర్మల సేవలు ప్రశంసనీయం
పెద్దపల్లి: సృజనాత్మకతతో సమాజ అభివృద్ధికి విశ్వకర్మలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ప్ర భుత్వ విప్ విజయరమణారావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకల్లో మాట్లాడారు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కలెక్టర్ కో య శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు మల్ల య్య, రాధాకృష్ణ, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షు డు రాజనందం, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


