‘ఖని’లో కాశీ గంగాహారతి | - | Sakshi
Sakshi News home page

‘ఖని’లో కాశీ గంగాహారతి

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

గోదావరిఖనిటౌన్‌: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జీఎంకాలనీలో బుధవారం రాత్రి టీమ్‌ 505209 యువత ఆధ్వర్యంలో కాశీ గంగాహారతి నిర్వహించారు. అర్చన సంతోష్‌రావు ముఖ్య అతిథులుగా హాజరు కాగా, నాయకులు వెంకన్న, బొంతల రాజేశ్‌, నెలకంటి రాము, అభి ప్రభ, వైభవ్‌, బ్లూపటేల్‌, శశి, పండు, పవన్‌, చిన్ని, ఈశ్వర్‌, శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌సీఐ అమరులకు నివాళి

ఫెర్టిలైజర్‌సిటీ: ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) అమర కార్మికులకు శుక్రవారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అలైడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు, 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెలకంటి రాము ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. 1990 సెప్టెంబర్‌ 17న సెకండ్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తుండగా పైపు నుంచి గ్యాస్‌ లీకై తొమ్మిది మంది పర్మినెంట్‌, ముగ్గురు కాంట్రాక్ట్‌ కార్మికులు మృత్యువాత పడ్డారని అన్నారు. ఈ ఘటన జరిగి 36 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. అయితే కర్మాగారంలో మృతి చెందిన కార్మికులకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం అధికారికంగా నివాళి అర్పించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు బొంతల రాజేశ్‌, కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్‌, ఆసిఫ్‌ పాషా, రమా శ్యాం, వడ్లకొండ మహేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛతపై అవగాహన

పాలకుర్తి: మండలంలోని పుట్నూర్‌ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి డీఆర్‌డీవో కాళిందిని ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్వచ్చతలో భా గంగా నాలుగు రకాల చెత్తను వేరుచేయుట గు రించి వివరించారు. పారిశుధ్యం, పర్యావరణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్వచ్చతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌, ఎస్‌బీఎం కోర్డినేటర్‌ రాఘవులు, ఎంపీవో సుదర్శన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నగరంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి

కోల్‌సిటీ: రామగుండం నగరంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చొరవతో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. 56వ డివిజన్‌ ద్వారకానగర్‌లో గురువారం రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన భూగర్భ నీటి కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఏళ్ల తరబడి డివిజన్‌లలో పేరుకుపోయిన సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. డిప్యూటీ మేయర్‌ ఎల్లయ్య, కార్పొరేటర్లు స్నప్న వేణు, కౌటం సతీశ్‌, దొంత శ్రీనివాస్‌, ముస్తాఫా, గట్ల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

జ్యోతినగర్‌: రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 33వ డివిజన్‌లో ఎన్టీపీసీ రామగుండం సీఎస్సార్‌ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. డిప్యూటీ మేయర్‌ ఎల్లయ్య, కార్పొరేటర్‌ భూలక్ష్మీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇంటింటా విచారణ

ధర్మారం: ధర్మారం పంచాయతీలో అసెస్‌మెంట్‌ నంబర్లు, నూతన గృహాల అనుమతుల్లో అవకతవకలపై గురువారం పెద్దపల్లి డివిజనల్‌ పంచాయతీ అధికారి దేవకీదేవి ఇంటింటా విచారణ చేశారు. గృహ నిర్మాణాల పత్రాలను పరిశీలించారు. ఇంటి నంబర్ల కేటాయింపుపై యాజమానులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తానని డీఎల్‌పీవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement