జిల్లాలో 2,46,981 బీపీఎల్ కుటుంబాల్లోని 7.18 లక్షల మందికి 410 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా 4,548 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు విజయరమణారావు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 1.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.14 కోట్ల సబ్సిడీతో 4.74 లక్షల సిలిండర్లను రూ.500కే అందించామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.245.27 కోట్ల మేర ఆదా జరిగిందని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7,199 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల పురోగతి ఆధారంగా 5,982 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.135 కోట్ల ఆర్థిక సహాయం జమ చేసినట్లు తెలిపారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగానికి 75,257 కనెక్షన్ల ద్వారా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఏటా రూ.101 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పాం సాగు విస్తరణలో భాగంగా ఈ ఏడాది 571 ఎకరాల్లో పంటను విస్తరించామని చెప్పారు. మొదటి సంవత్సరం తోటల ఏర్పాటుకు రూ. 86.79 లక్షలు, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల నిర్వహణకు 2,173 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటకు రూ.91.27 లక్షలు, తెలంగాణ సూక్ష్మ నీటి సేద్య పథకం కింద 567 ఎకరాలకు రూ.1.33 కోట్ల రాయితీ అందించినట్లు వివరించారు.
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా హ్యామ్ మొదటి దశలో సుమారు 141 కిలోమీటర్ల మేర 44 రహదారి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. పెద్దపల్లి ప్రజల చిరకాల కల అయిన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి రూ.8.40 కోట్లు మంజూరయ్యాయని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఉచిత అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంథనిలో రూ.7.50 కోట్లతో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాల ద్వారా 694 పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లోని సుమారు 40 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని అన్నారు.
పెద్దపల్లిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.82 కోట్లు మంజూరు చేశారని అన్నారు. సెంట్రల్ లైటింగ్‌తో నిర్మించనున్న ఈ రహదారి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనుందని తెలిపారు.
వేడుకలకు హాజరైన జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు
40 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.135 కోట్లు
మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు
రూ.82 కోట్లతో 4లేన్ల బైపాస్ రోడ్డు
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం


