గోదావరిఖని: సోషల్‌మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా అన్నారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని అన్ని వర్గాల మతపెద్దలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన శాంతి సమావేశంలో మాట్లాడారు. సమాజంలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం కొనసాగేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా చిన్నపాటి సంఘటన, వివాదం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అన్ని మతాల విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. ఈసారి గణేశ్ వేడుకల్లో డీజేలకు అనుమతులు లేవని, నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ(అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు భీమేష్, శ్రీనివాస్, బెల్లంపల్లి సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐలు మనోహర్, రాజేందర్, చంద్రశేఖర్, సంధ్యారాణి, శ్రీలత, మతపెద్దలు,ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గణపతి వేడుకల్లో డీజేలకు అనుమతులు లేవు
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా


