● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచన
వేములవాడ: సైబర్ మోసాలు రోజుకో తీరున జరుగుతున్నాయి. షాపింగ్‌పై డిస్కౌంట్లు, బంపర్‌డ్రా వచ్చిందంటూ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు తాజాగా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందంటూ వాట్సాప్‌లో ఆర్టీవో పేరట మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ టెక్ట్స్ ఫైల్‌ను ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతుండడంతో వేములవాడ పట్టణంలో సోమవారం వైరల్‌గా మారింది. పట్టణానికి చెందిన సురేష్‌కు ఆదివారం ఈ మెసేజ్ రాగా.. ఓపెన్ చేయడంతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన సురేష్ స్థానికంగా ఉన్న సోషల్‌మీడియా గ్రూప్‌లలో ఇలాంటి మెసేజ్ వస్తుందని అలర్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు.


