గోదావరిఖని: బొగ్గుగనుల్లో భద్రతా ప్రమాణాలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ధన్‌బాద్‌కు చెందిన డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్‌తాహ్ అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ శ్రీమయి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ముందుగా గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సింగరేణి డైరెక్టర్ ఎల్‌వీ సూర్యనారాయణ మాట్లాడుతూ గనుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నామని, రక్షణకు పెద్దపీట వే స్తున్నామన్నారు. డీవైడీజీఎంఎస్ అధికారులు క న్న న్, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, వెంకన్న, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు సీ తారామయ్య, జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. పలుగనులకు రక్షణ బహుమతులు అందజేశారు.


