55 అడుగులతో మెయిన్‌ రోడ్డు విస్తరణ | - | Sakshi
Sakshi News home page

55 అడుగులతో మెయిన్‌ రోడ్డు విస్తరణ

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

● ప్రభుత్వ విప్‌ సమక్షంలో వ్యాపారుల అంగీకారం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ రోడ్డు విస్తరణపై బుధవారం స్పష్టత వచ్చింది. పట్టణాభివృద్ధిలో భాగంగా మెయిన్‌ రోడ్డును 66 అడుగులకు విస్తరించాలని అధికారులు నిర్ణయించగా.. వ్యాపారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. అటు, ఇటు చర్చలు జరిపిన నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌, కౌన్సిలర్ల సమక్షంలో వ్యాపారులతో చర్చించారు. 55 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేపట్టాలన్న వ్యాపారుల అభ్యర్థనను మున్సిపల్‌ పాలకమండలి అంగీకరించింది.

నోటీసులు జారీ చేస్తాం – వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డు విస్తరణను 55 ఫీట్లతో విస్తరించనున్నాం. ఇందుకు గాను 55 ఫీట్ల మేర హద్దులు నిర్ణయించి మార్కింగ్‌ చేస్తాం. ఇళ్ల యజమానులకు గురువారం నోటీసులు జారీచేస్తాం. 15రోజులపాటు గడువు ఇచ్చి ఆ తదుపరి నిర్మాణాలు ఉంటే కూల్చి విస్తరణ పనులు చేపడతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement