పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి–కూనారం రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ వద్ద బుధవారం రాత్రి ధా న్యం లారీ పట్టాల మధ్య ఇరుక్కుంది. లారీ క దలకపోవడంతో ఆ సమయంలో వస్తున్న కేర ళ, జైపూర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరిసర ప్రాంతాల్లోనే నిలిపివేశారు. స్థానికుల సా యంతో లారీని పట్టాలపై నుంచి తొలగించేందుకు దాదాపు అర్ధగంట పాటు ఇబ్బంది పడ్డా రు. ఎలాగోలా లారీ పట్టాలపై నుంచి బయట కు రావడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైల్వేగేట్‌ను వారం క్రితం మూసిఉంచిన అధికారులు.. పట్టాల మరమ్మతు చేపట్టారు. స్లీపర్లను మార్చే పనులు పూర్తికావడంతో బుధవారం సాయంత్రమే గేటు తెరిచారు. కాసేటికే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
కుప్పకూలిన రైస్‌మిల్లు
పెద్దపల్లి: జిల్లాలోని బుధవారం ముసరువానకు కురిసింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని సాయి సరస్వతి బాయిల్డ్ రైస్‌మిల్లు గోడలు కుప్పకూలినట్లు కార్మికులు తెలిపారు. గోదాములో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్ద య్యింది. సుమారు రూ.3కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీకాంత్ అధికారులకు విన్నవించారు. సమాచారం అందుకున్న రైస్‌మిల్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు విజయ్‌పాల్‌రెడ్డి, చీటి సతీశ్‌రావు కేశవరావు తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
‘ఎల్లంపల్లి’లోకి ఇన్‌ఫ్లో
రామగుండం: రెండు రో జులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో బుధ వారం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీ టినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.87 టీఎంసీలు ఉంది. ఇన్‌ఫ్లో 1,808 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 396 క్యూసెక్కులుగా ఉంది. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 275 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ
రామగిరి: జాతీయ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్వచర్లలోని ఓ పాఠశాల ఆధ్వర్యంలో 500 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఎస్సై శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మన జాతీయ పతాకం దేశ సమైక్యత, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, సార్వభౌమత్వానికి ప్రతీక అని ఎస్సై అన్నారు. పాఠశాల ఇన్‌చార్జి కొప్పుల గోవర్ధన్, ఉపాధ్యాయులు వీర్రాజు, రవీందర్, దేవదాస్, ఇందిరా, రజిత, బిందు తదితరులు పాల్గొన్నారు.


