న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026
చాలారోజుల నిరీక్షణ తర్వాత జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. తొలకరి ఆధారంగా పత్తి విత్తనాలు వేసినా.. ఆ తర్వాత ముఖం చాటేయడంతో ఆందోళనకు గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో పత్తి మొక్కలు వాడి నేలవాలాయి. కొన్నిచోట్ల రెండోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఈక్రమంలో మూడు రోజులుగా కురుస్తున్న జల్లులు మొక్కలకు జీవం పోయడంతో పచ్చదనం సంతరించుకుంటున్నాయి. రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. అయినా సీజన్ పూర్తిస్థాయిలో గాడిన పడాలంటే మరింత వర్షం అవసరమని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.


