ఆరుతడి పంటలే మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలే మేలు

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

ధర్మారం: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ కోరారు. నందిమేడారం రైతువేదికలో మంగ ళవారం ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అంతకుముందు పైడిచింతలపల్లి, ర చ్చపల్లిలో సర్‌ ప్రక్రియ పరిశీలించారు. నందిమేడారంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి రెండు ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశం కల్పించారు. విద్యుదాఘాతంతో ఇటీవల మరణించిన కట్ట అశోక్‌ కుటుంబానికి రూ.8లక్షల చెక్కు అందించారు. అంగన్‌ వాడీ భవనాలు ప్రారంభించారు. ధర్మారం మండల పరిషత్‌ కార్యాలయంలో 34 మందికి కల్యాణలక్ష్మి, 73 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందించా రు. మేడారంలో మంత్రి మాట్లాడుతూ, వరి సాగు పై పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయాధికారుల సూచనలను పాటించాలన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, నాయకులు అరిగే లింగయ్య, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త నర్సింహులు, సున్నం రాజయ్య, వీర్‌పాల్‌, సంగ రంజిత్‌, చింతల ప్రదీప్‌రెడ్డి, దాగేటి ఉదయ్‌యాదవ్‌, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్‌ పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement