ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్‌షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్‌బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి.
– కె.రాణాప్రతాప్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి


