ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

కోల్‌సిటీ: రామగుండం నగరంలో జరుగుతు న్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నా యకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్ర మాదాల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో బల్దియా కార్యాలయం ఎ దుట మంగళవారం ధర్నా చేశారు. ఎస్సీ మో ర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాజీపేట శివాజీ మా ట్లాడుతూ, ఇంజినీరింగ్‌ ప్రమాణాలు పాటించకుండా, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయకుండా ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వారంలో గా తగిన చర్యలు తీసుకోకుంటే బల్దియా కా ర్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయ కార్యదర్శి ఉమామహేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు కొండపర్తి సంజీవ్‌కుమార్‌, జక్కు ల నరహరి, సులువ లక్ష్మీనరసయ్య, మాతంగి రేణుక, ఊరగొండ అపర్ణ, కోడూరు రమేశ్‌, ఐ త పవన్‌, మాదరబోయిన రాకేశ్‌ పాల్గొన్నారు.

డ్రగ్స్‌తో ఆరోగ్య సమస్యలు

రామగుండం: మాదక ద్రవ్యాలతో ఆరోగ్య స మస్యలు తలెత్తుతాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. స్థానిక తబితా ఆశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. చైల్డ్‌ సేఫ్టీ – డ్రగ్స్‌కు నో చెప్పండి అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించా రు. ఎస్సై సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు బదావత్‌ సారయ్యనాయక్‌, డీసీపీ బూక్య రాంరెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై ఉదయ్‌కిరణ్‌, పోలీసు సిబ్బంది రవీందర్‌, సాగి ప్రభాకర్‌రావు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

అనుమతి ఇవ్వాలని వినతి

రామగుండం: స్థానిక క్రీడా మైదానంలో మే 3న నిర్వహించనున్న హిందూ మెగా సమ్మే ళనం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని బీ–థర్మల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ దాసరి శంకరయ్యకు నిర్వాహకులు మంగళవారం వినతిప త్రం అందజేశారు. సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులతో పాటుగా అత్యధికంగా హిందువులు హాజరుకానున్నారని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో నిర్వాహకులు తూండ్ల శ్రీనివాస్‌ పటేల్‌, వడ్డెపల్లి సురేశ్‌, జాగటి శ్రీకాంత్‌కుమార్‌, మద్ధి అన్వేశ్‌, లగిశెట్టి రవి తదితరులు ఉన్నారు.

తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు

పెద్దపల్లి: నిర్దేశిత తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం తూకం వేయాలని అదనపు కలెక్టర్‌ వే ణు సూచించారు. సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఆయన ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేస్తారని వి వరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, కార్యదర్శి సంతోష్‌, రైతులు ఉన్నారు.

ఒకేపంట.. రెండు రంగుల్లో..

మంథనిరూరల్‌: ప్రకృతిలో ఆకట్టుకునే సన్నివేశాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ కనువిందు చేస్తున్న ఈ దృశ్యం కూడా ఇలాంటిదే. మంథని శివారులోని ఓ పొలంలో వరి సాగుచేశాడు ఓ రైతు. అయితే, పంట ప్రస్తుతం కోత దశకు చేరింది. రెండు మడుల్లోని పంట రెండు రంగులతో కనువిందు చేస్తోంది. పక్కనే పక్కనే ఉన్న ఒకేరకం పంటలో ఒకటి ఆకుపచ్చగా మరొకటి పసుపుపచ్చగా కనిపిస్తుండడం ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement